శివ్వంపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన సహకార ఆంజనేయ స్వామి చాకరిమెట్ల ఆలయాన్ని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు శనివారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన రాకను పురస్కరించుకొని ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ప్రధాన అర్చకులు దేవదత్తుర్మలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు ని ర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆవరణలో గల నూతనంగా నిర్మించిన సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ ంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ, సీ తారామచంద్ర స్వామి యొక్క విశేషాలు తెలియజేశారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వార్లను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ సమీపంలోని సత్యనారాయణ స్వామి, వ్రతమండపంలో భక్తులు సత్యనారాయణ స్వామి, వ్రతాలు నిర్వహించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఆ లయం తరఫున ఏర్పాటు చేసిన భోజనశాలలో భోజనాలు చేశారు. ఆలయ అర్చకులు సిబ్బంది శ్రీనివాస చారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చాకరిమెట్ల ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
- Advertisement -
- Advertisement -
- Advertisement -