Monday, December 23, 2024

సీతారామచంద్రస్వామిని దర్శించున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు

- Advertisement -
- Advertisement -

మెదక్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని రామాలయంలో సీతారామచంద్రస్వామిని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మదుసూదనాచార్యులు శేరి దంపతుల చేత రాములవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరి దంపతులకు స్థానిక కౌన్సిలర్ దుర్గాప్రసాద్, ఆలయ కమిటీ అD్యక్షుడు బండ నరేందర్ తదితరులు స్వాగతం పలికారు. పూజ కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్సీ శేరిని ఆలయ కమిటీ నాయకులు బండ నరేందర్ తదితరులు శాలువతో సన్మానించారు. తర్వాత దేవస్థాన ఆవరణలో ఉన్న చిదంబర స్వామి ఆలయాన్ని కూడా ఎమ్మెల్సీ దర్శించుకుని హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీకి ఆలయ కమిటీ నాయకులు వివరించారు. రామాలయానికి నూతనంగా నిర్మిస్తున్న ద్వారానికి సంబందించిన పనులను ఎమ్మెల్సీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు, సర్పంచ్‌లు, కృష్ణశాస్త్రీ, శుక్లా తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News