గ్రీన్ ఇండియా ఛాలెంజ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంను స్ఫూర్తిగా తీసుకొని మంగళవారం తన జన్మదినం సందర్భంగా మెదక్ జిల్లాలోని రాస్‌పల్లి గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి మొక్కలు నాటారు. అదే విధంగా తన జన్మదినం సందర్భంగా ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ప్రతి ఒక్కరూ విధిగా మూడు మొక్కలు నాటాలి
మొక్కలు నాటి పిలుపునిచ్చిన నూతన వధూవరులు
రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో నూతన వధూవరులు మొక్కలు నాటారు. అల్లూరి ప్రియాంకరెడ్డి మధురెడ్డి గారి పెండ్లి రోజున నవ దంపతులు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండి యా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ తమ వంతుగా మూడు మొక్కలు నాటాలని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.