Monday, December 23, 2024

బోరంచమ్మ మాతకు ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మెదక్ టౌన్: మెదక్ పట్టణముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోరంచమ్మ మాత అమ్మవారికి నిర్వహిస్తున్న బోనాల కార్యక్రమాన్ని పురస్కరించుకుని బోరంచమ్మ ఆలయాన్ని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సందర్శించారు. పట్టణ ముదిరాజ్ సంఘం ఆహ్వానం మేరకు ఉత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీని మేళతాళాలతో ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి చేత వేద పండితులు, ముదిరాజ్ సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేయించి హారతిని ఇప్పించారు. తమ ఆహ్వానం మేరకు బోనాల ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎమ్మెల్సీని ముదిరాజ్ సంఘం నాయకులు శాలువ కప్పి సన్మానించారు.

బోనాల ఉత్సవం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ సం స్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నందుకు ముదిరాజ్ సంఘం నాయకులను ఎమ్మెల్సీ అభినందించారు. అమ్మవారి దర్శనం, పూజ కార్యక్రమా ల అనంతరం పట్టణం ముదిరాజ్ సంఘం నాయకులతో ఎమ్మెల్సీ అప్యాయంగా ముచ్చటించారు. పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సున్నం నరేష్, సెక్రటరీ తలారి సంతోష్, వెల్మకన్నె శేఖర్, ఉత్సవ కమిటీ అద్యక్షుడు అది సురేందర్, అంకం కృష్ణ, రాజు, సెక్రటరీ చింతల కార్తీక్, పురం హరిప్రసాద్, బంటి, చింటు,హవేళిఘనపూర్ మండల సర్పంచ్ శ్రీను నాయక్, మాజీ వైస్ ఎంపిపి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News