Wednesday, January 22, 2025

తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలి..రూ.5 వేల కోట్లు కేటాయించాలి : ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ శాసనమండలిలో సాగునీటి ప్రాజెక్టులపై స్వలకాలిక చర్చ జరిగింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ‘తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలి. అప్పుడే ప్రాణహిత నది నుంచి పుష్కలంగా నీళ్లు అందుతాయి. ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలి’ అని కోరారు. గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉందని మరో ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇది పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం చేకూరుతుందని, ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News