Friday, December 27, 2024

తెల్లం వెంకట్రావ్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

దుమ్ముగూడెం: బిఆర్‌ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి తెల్లం వెంకట్రావ్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ఓటువేసి గెలిపించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. గురువారం మండలంలోని జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇంతకాలం వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈ సారి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడైనా తెల్లం వెంకట్రావ్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదల ప్రాణాలు నిలబెట్టిన తెల్లంకు ఓటువేసి గెలిపిస్తే మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తారని పేర్కొన్నారు. తెల్లంను గెలిపించుకోని భద్రాచలం అభివృద్దికి పాటుపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యడం వల్ల సాధించేది ఏమి లేదని, ఆ పార్టీకి ఓటువేస్తే చీకట్లోకి వెళ్లినట్లేనని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం మాట్లాడుతూ… చిన్నతనం నుండి ఈ ప్రాంతంలో తిరిగినవాడినని, ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలిసిన వాడినని ప్రజలు ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల నాయకులు అన్నె సత్యనారాయణమూర్తి,కనితి రాముడు,భద్రాచలం నాయకులు తాండ్ర వెంకటరమణరావు,బొల్లిశెట్టి రంగరావు,జడ్పీటీసీ తెల్లం సీతమ్మ,సీనియర్ నాయకులు మట్టా శివాజి,శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News