Friday, December 20, 2024

నేడు మహారాష్ట్రకు ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

సోలాపూర్ లో బతుకమ్మకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మన తెలంగాణ / హైదరాబాద్:  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సోలాపూర్ లో జరగనున్న బతుకమ్మ సంబరాలకు హాజరుకానున్నారు. నగరంలోని పుంజాల్ మైదాన్ లో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవం లో పెద్ద ఎత్తున పాల్గొననున్న ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి కవిత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ముమ్మరంగా చేస్తున్నారు.

నగరంలోని దత్తవాడ నుంచి సాయంత్రం 5. గం. లకు ప్రారంభమయ్యే బతుకమ్మ శోభయాత్రలో కవిత పాల్గొంటారు.ఈ శోభయాత్ర సాయంత్రం 6.00 గంటలకు అక్కల్ కోట్ రోడ్ లోని పుంజాల్ మైదాన్ కు చేరుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మలు తలకెత్తుకొని నగరం లోని ఆడబిడ్డలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలి రావలసిందిగా నిర్వాహకులు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేశారు. సోలాపూర్ లో జరిగే కార్యక్రమానికి కవిత గారు హాజరు కావడం తమకు ఆనందంగా ఉందని స్థానిక ఏర్పాట్లను బిఆర్‌ఎస్ నాయకులు నగేష్ వల్యాల్, దశరథ్ గోప్ లు అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News