Friday, November 22, 2024

ఈడి సమన్లపై రాజ్యసభలో ఖర్గే, ఘోయల్ వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

 

Mallikarjun Kharge

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల సంధర్భంలోనే  విపక్ష నాయకులకు సమ్మన్లు పంపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) వేధించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. అంతేకాక ఆయన విపక్షనాయకులను బెదిరిస్తూ, ఢీలా పడిపోయేలా చేసేందుకు యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ఓ ప్రక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే ప్రతిపక్ష నాయకుడినైన తనని రమ్మని సమ్మన్లు పంపారని ఆయన చిర్రెతిపోయారు. ‘‘ఈడి ఇలా చేయడం సక్రమమేనా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నోత్తర కాలంలో ఆయన ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. ‘‘ఈ సభ(ఎగువసభ) జరుగుతుండగానే నన్ను రమ్మని సమ్మన్లు పంపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఇలా చేయడం ఆ ఈడికి సబబేనా? ఇది సిగ్గుపడాల్సిన దినం’’ అంటూ ఆయన రెచ్చిపోయారు.  తాను చట్టానికి కట్టుబడి ఉండే మనిషినని, తాను ఈ రోజు మధ్యాహ్నం ఈడి కార్యాలయానికి వెళ్ళాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గృహాలను కూడా పోలీసులు ఘేరావ్ చేసి ఉంచారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చట్టాన్ని కాంగ్రెస్ సవాలు చేస్తుందే తప్ప పారిపోదని అన్నారు. కాగా ‘‘ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏదీ లేదు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు తమ పనిచేసుకుపోతున్నాయి. విపక్ష నాయకుడు చేస్తున్నదంతా నిరాధార ఆరోపణలు’’ అని సభా పక్షం నాయకుడు పియూష్ ఘోయల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News