Friday, December 20, 2024

నిఖత్‌కు నజరానా

- Advertisement -
- Advertisement -

MLRIT has given huge cash prize to Nikhat Zareen

 

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఎంఎల్‌ఆర్‌ఐటి సంస్థ భారీ నగదు పురస్కారాన్ని అందజేసింది. నికత్ ఎంఎల్‌ఆర్‌ఐటిలో ఎంబిఎ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా శనివారం ఎంఎల్‌ఆర్‌ఐటిలో నిఖత్‌ను ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారు. నిఖత్‌ను ఓపెన్ టాప్ జీప్‌పై మైసమ్మ సర్కిల్ నుంచి దుండిగల్‌లోని కళాశాల వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు నిఖత్‌కు నాలుగు లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఆర్‌ఐటి విద్యా సంస్థల చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News