Sunday, December 22, 2024

జెంటిల్‌మేన్-2 సంగీత దర్శకుడిగా కీరవాణి..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ నిర్మించిన జెంటిల్‌మేన్, కాదలన్ (ప్రేమికుడు), కాదల్ దేశం (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాషలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ జెంటిల్‌మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై తన సూపర్ హిట్ సినిమా జెంటిల్‌మేన్‌కు తాజాగా సీక్వెల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు సంబందించి ఇటీవల ట్విట్టర్‌లో ఒక కాంటెస్ట్‌ను నిర్వహించారు. #G2Musicdirector అనే హ్యాష్ ట్యాగ్‌తో తన జెంటిల్‌మేన్2 చిత్రానికి సంగీతం చేయబోతున్న లెజెండరీ సంగీతకారుడిని ఊహిస్తే.. అదృష్టవంతులైన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడుతుంది అని తెలిపారు. ఆదివారం జెంటిల్‌మేన్2 సినిమాకు సంగీత దర్శకుడిగా స్వరవాణి కీరవాణి పనిచేస్తున్నారని నిర్మాత కుంజుమన్ ప్రకటించారు. త్వరలోనే బంగారు నాణేల విజేతలను కూడా ప్రకటిస్తాను. అని నిర్మాత కే.టి కుంజుమన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కేటి కుంజుమన్ నిర్మించిన ‘జెంటిల్మేన్’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

MM Keeravani to produce Music for Gentleman 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News