Monday, December 23, 2024

మార్కెట్ సూచీలు కనిష్ఠం నుంచి తేరుకుని ఫ్లాట్ గా ముగిసాయి

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు(జులై 25న) వరుసగా ఐదో రోజున కూడా ప్రాఫిట్ బుకింగ్ కొనసాగింది. నేడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్ పైరీ డే కావడంతో ఓలాటిలిటీ చాలా ఉండింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109.08 పాయింట్లు లేక 0.14 శాతం పతనమై 80039.80 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 7.40 పాయింట్లు లేక 0.03 శాతం పతనమై 24406.10 వద్ద ముగిసింది. నిఫ్టీ నేటి అత్పల్పం నుంచి 195 పాయింట్లు రికవర్ అయింది. కాగా బిఎస్ఈ సెన్సెక్స్ నేటి అత్యల్పం నుంచి 560 పాయింట్లు రికవర్ అయింది.

‘గ్లోబల్ క్యూస్’ బలహీనంగా ఉండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నెగటివ్ గానే మొదలయ్యాయి. నష్టాలతో మొదలయి కొనసాగాయి. కానీ చివరలో కొనుగోళ్లు పెరగడంతో నేటి దినం అత్యల్పం నుంచి నష్టాల నుంచి కొద్దిగా కోలుకున్నాయి. నిఫ్టీలో టాటామోటర్స్, ఓఎన్జిసి, ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్, సన్ ఫార్మ లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి.

‘ఏ’ గ్రూప్ షేర్లలో ఎంఎంటిసి మళ్లీ తన హవా చూపింది. డెయిలీ ట్రేడింగ్ లో మధ్యాహ్నం 11.46 గంటలప్పుడు 13.4% పెరిగి రూ. 116.49 వద్ద ఉండింది. బిఎస్ఈ ‘ఏ’ గ్రూప్ షేర్లలో ప్రధాన లాభకారి షేర్ గా నిలిచింది. చివరికి అప్పర్ సర్య్యూట్ ను తాకి లాక్ అయింది. అప్పుడు దాని ముగింపు ధర రూ. 123.12.  బిఎస్ఈ లో నెలవారీ సగటు డైలీ వాల్యూమ్ చూస్తే 17.74 లక్షల షేర్లు ఉండగా, నేడు దానికి భిన్నంగా 61.3 లక్షల షేర్లు కౌంటర్ లో ట్రేడయ్యాయి. ఎంఎంటిసి తో పాటు డేటా ప్యాటర్న్స్(ఇండియా)లిమిటెడ్, ఎంఎస్ టిసి, పిజి ఎలెక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్లు బాగా లాభపడ్డాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News