Monday, January 20, 2025

హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్

- Advertisement -
- Advertisement -

ఎయిర్‌పోర్ట్టులను తలపించేలా రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధి
వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు నెల రోజుల్లో చర్లపల్లి రైల్వే
టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ కేంద్ర బొగ్గు,
గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/చర్లపల్లి:త్వరలో హైదరాబా ద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ సేవ లు అందుబాటులోకి రానున్నాయని కేం ద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపా రు. మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్‌జైన్‌తో కలసి అత్యాధునిక హంగుల తో నిర్మిస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఆయ న ఆదివారం సందర్శించారు. ఈ సందర్శం గా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఎయిర్‌పోర్టులను తలపించేలా తెలంగాణలోని రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. నెల రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధానమంత్రి మోడీతో ప్రా రంభింపజేస్తామని తెలిపారు. స్వాతంత్య్రం వ చ్చిన నాటి నుంచి తెలంగాణకు రైల్వేల విషయంలో అన్యాయం జరిగిందని అన్నారు. కేం ద్రంలోని తమ ప్రభుత్వం హయాంలో రూ. 715 కోట్లతో సికిందరాబాద్, రూ.429 కోట్ల తో నాంపల్లి, రూ.430 కోట్లతో చర్లపల్లి స్టేష న్లు స్టేట్ అఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

రూ.521 కోటతో రైల్ మాన్యుఫాక్చర్ యూనిట్, 346 కిలోమీటర్ల మేర నూతన లైన్, 369 కిలోమీటర్ల మేర సిం గిల్, డబుల్ లైన్లు నిర్మించామని తెలిపారు. రైల్వే ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన రైల్వేకవచ్‌ను తెలంగాణలో ప్రయోగాత్మాకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే వందేభారత్ రైళ్లు ఎక్కువగా ఉన్నాయని, త్వరలోనే వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న నాంపల్లి, సికిందరాబాద్, కాచిగూడతో పాటు నాల్గవ స్టేషన్ చర్లపల్లి సిద్ధమైందని తెలిపారు. 98 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. స్టేషన్‌కు వచ్చే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి, అధికారులతోపాటు తాను రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా లేఖ రాశానని తెలిపారు. ఈ స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌లేటర్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు సత్యాప్రకాష్, బర్‌తేష్ కుమార్ జైన్, మాజీ ఎంఎల్‌ఎ ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News