Monday, January 20, 2025

ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాల డైరెక్టర్ నారయణ రాజును అరెస్ట్ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాల అసోసియేట్ డైరెక్టర్ నారాయణ రాజును అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ గతంలో మహిళ మెడికోలను వేధింపులు గురిచేసినందుకు పోలీసులు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ అయ్యాడు. మళ్ళీ తన పలుకుబడి ఉపయోగించుకోని వచ్చి ఫిర్యాదు చేసిన రష్మీత అనే మెడికోపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఆమెను పరీక్షలలో ఫెయిల్ చేసి మానసికంగా వేధింపులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకుని వచ్చిన వెనక్కి తీసుకోకపోవడంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని తక్షణమే నారాయణరాజును సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి, రష్మితకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోందన్నారు. పోలీసుల నిర్లక్షం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News