Monday, December 23, 2024

రాజ్ థాక్రేకు హాని జరిగితే మంటల్లో మహారాష్ట్ర

- Advertisement -
- Advertisement -

MNS warns Uddhav government

ఉద్ధవ్ సర్కార్‌కు ఎంఎన్‌ఎస్ హెచ్చరిక

ముంబయి: ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ థాక్రేను బెదిరిస్తూ వచ్చిన లేఖపై ఆ పార్టీ నాయకుడు బాలా నంద్‌గావంకర్ బుధవారం మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సీ పాటిల్‌ను కలుసుకుని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అనంతరం నంద్‌గావంకర్ విలేకరులతో మాట్లాడుతూ తమ అధినేతకు ఎటువంటి హానిజరిగినా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మసీదులపై లౌడ్‌స్పీకర్లలో అజాన్ కొనసాగితే మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ రాజ్ థాక్రే గతంలో చేసిన హెచ్చరికను ప్రస్తావిస్తూ తమ పార్టీ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ వచ్చిందని ఆయన తెలిపారు. రాజ్ థాక్రేకు చిన్నపాటి హాని జరిగినా రాష్ట్రంలో తగలబడి పోతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News