Monday, December 23, 2024

మేఘాలయాలో పోలీసు స్టేషన్ మూకల దాడి: వాహనాలకు నిప్పు

- Advertisement -
- Advertisement -

షిల్లాంగ్: ఘర్షణపడిన రెండు వర్గాలు తమ ఫిర్యాదులను పోలీసులు నమోదు చేయనందుకు ఆగ్రహిస్తూ మేఘాలయాలోని ఖాసీ హిల్స్ జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌పై దాడిచేయడంతోపాటు పోలీసు స్టేషన్ ఆవరణలో నిలిపి ఉన్న మూడు వాహనాలు, ఒక టూవీలర్‌కు నిప్పుపెట్టారు.

లుఖ్రా పోలీసు స్టేషన్ వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. తీవ్ర స్థాయిలో గొడవపడిన రెండు వర్గాలు తమ పిర్యాదులను నమోదు చేయనందుకు విధులలో ఉన్న పోలీసులతో వాగ్యుద్ధానికి దిగినట్లు వారు చెప్పారు. పోలీసు స్టేషన వెలుపల గుమికూడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు స్టేషన్‌పై రాళ్లు ర్వుడంతోపాటు మూడు వాహనాలు, ఒక టూవీలర్‌కు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. జిల్లా పోలీసు ఎస్‌పి సిల్విస్టర్ నంగ్‌టింగర్ ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News