Monday, December 23, 2024

50 మంది పోలీస్ స్టేషన్‌పై దాడి…. ముగ్గురు నిందితులను తీసుకెళ్లారు…

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: సింగం సినిమాలో మాదిరిగా ఒకేసారి 50 మంది పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ముగ్గురు ఖైదీలను విడిపించుకొని వెళ్లిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం బుర్హన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నేపానగర్ పోలీసులు హేమా మేగ్వాల్‌తో పాటు ఇద్దరు అనుచరులను అరెస్టు చేసి లాకప్‌లో ఉంచారు. దీంతో 50 మంది ఒక్కసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి నలుగురు పోలీసులపైన విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం హేమా మెగ్వాల్‌తో పాటు మరో ఇద్దరు విడిపంచుకొని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సిసి కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడిన పోలీసులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎస్‌పి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని దాడి చేసిన వారిపై కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులపైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News