Monday, December 23, 2024

మణిపూర్‌లో పోలీసుల ఆయుధాగారం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు లూటీ

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా నరన్‌సీన వద్ద ఉన్న 2వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్‌బి)కు చెందిన ఆయుధాగారంపై గురువారం దాడిచేసిన దాదాపు 500 మంది సాయుధ ముష్కరులు ఉన్సాస్, ఎంపి5 రైఫిల్స్, హ్యాండ్ గ్రెనేడ్స్‌తోసహా సుమారు 300 ఆయుధాలను లూటీ చేశారు. ఈ మేరకు మణిపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బెటాలియన్ తెలిపింది.

Also Read: తొలి టి-20లో ఇండియా ఓటమి

గురువారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చురచంద్‌పూర్ జిల్లాలోని ఒక స్థలంలో కుకీలకు చెందిన 35 మృతదేహాలను సామూహికంగా ఖననం చేయడానికి ట్రైబల్ లీడర్స్ ఫోరమ్(టిఎల్‌ఎఫ్) అనే సంస్థ ఏర్పాట్లు చేయగా దీన్ని నిరసిస్తూ కొందరు మైతేయి మహిళలు ప్రదర్శన నిర్వహించింది. అది మైతేయులకు చెందిన గ్రామమని, మే 3న హింసాకాండ చెలరేగిన తర్వాత మైతేయులను ఆ గ్రామం నుంచి కుకీలు వెళ్లగొట్టారని ఆ మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయుధాగారంలో లూటీ జరిగింది.

దాదాపు 40 నుంచి 45 వాహనాలలో వచ్చిన సుమారు 500 మంది సాయుధ ముష్కరులు ప్రధాన గేటు వద్ద ఉన్న సెంట్రీని, క్వార్టర్ గార్డును చితకబాది, రెండు తలుపులు పగలగొట్టి ఆయుధాగారంలోకి ప్రవేశించారని మోయిరంగ్ పోలీసు స్టేషన్‌లో నమోదుచేసిన ఫిర్యాదులో 2వ ఐఆర్‌బికి చెందిన ఓ ప్రేమానంద సింగ్ తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆయుధాలను లూటీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన ఫిర్యాదు లేఖను పోలీసులు శుక్రవారం బహిర్గతం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం 200 రైఫిల్స్, 17 పిస్టల్స్, మోర్టార్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, టియర్ గ్యాస్ షెల్స్, ఒక ఎకె సిరీస్ రైఫిల్, 3 ఘటక్ రైఫిల్స్, 25 ఇన్సాస్ రైఫిల్స్, 5 ఎంపి 5రైఫిల్స్, 195 7.62 ఎంఎం ఎస్‌ఎల్‌ఆర్, 16 9ఎంఎం పిస్టల్స్, 21 ఎస్‌ఎంసి కార్బైన్స్, 3 మోర్టార్స్, 74 డిటోనేటర్లు, 124 హ్యాండ్ గ్రెనేడ్స్ మొదలైనవి ఉన్నాయి. మూకను అదుపుచేయడానికి 327 రౌండ్ల మందుగుండు, 20 బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూన్‌లో ఇదేవిధదంగా మైతేయి తెగకు చెందిన సాయుధ ముష్కరులు దాదాదాపు 4,000 ఆయుధాలను ఆయుధాగారం నుంచి లూటీచేయగా సైన్యం పారామిలిటరీ దళాలు గాలింపులు చేపట్టి సుమారు 1,000 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తమపై దాడి చేసేందుకు ఈ లూటీ చేసిన ఆయుధాలను ఉపయోగించవచ్చని కుకీ సంఘాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. మే 3న ప్రారంభమైన మణిపూర్ ఘర్షణల్లో ఇప్పటివరకు 150 మంది మరణించగా 60,000 మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News