Wednesday, January 22, 2025

మేఘాలయ సిఎం కార్యాలయ ముట్టడి

- Advertisement -
- Advertisement -

తురా : మేఘాలయాలో సోమవారం ముఖ్యమంత్రి కొనార్డ్ సంగ్మా కార్యాలయాన్ని ఓ గుంపు ముట్టడించింది. వీరిని అడ్డుకున్న ఐదుగురు భద్రతా సిబ్బందిపై గుంపు దాడికి దిగింది. దీనితో సిబ్బంది గాయపడింది. సిఎం కార్యాలయంలోపల ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. సిఎం ఉన్నప్పుడే భద్రతావలయాన్ని ఛేదించుకుని అల్లరిమూక కాంపౌండ్ చుట్టుముట్టింది. దీనితో చాలా సేపటివరకూ ఉద్రిక్తత నెలకొంది. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని గారో హిల్స్ సామాజిక సంస్థలు నిరాహార దీక్షలకు దిగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తమ డిమాండ్‌ను గట్టిగా విన్పించేందుకు వీరు సిఎం ఇంటిపై దాడికి దిగారని వెల్లడైంది. గుంపు ఉన్నట్లుండి రాళ్లు విసరినట్లు, దీనితో భద్రతా సిబ్బంది గాయపడ్డట్లు, గాయపడ్డ వారిని సంగ్మా ఆఫీసులోకి తీసుకువెళ్లినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News