ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం రాత్రి రాష్ట్ర పజారోగ్య, ఇంజనీరింగ్, వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి సుశీందర్ మీటీకి చెందిన ప్రైవేట్ గిడ్డంగిని మూకలు కాల్చివేశాయి. మణిపూర్‌లో పరిస్థితిని చర్చించడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంఫాల్ తూర్పులోని ఖురల్‌లో శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి సుశీంద్ర మీటీ ఢిల్లీ పర్యటనలో ఉన్నవేళ ఆయనకు చెందిన ఒక ప్రైవేట్ గిడ్డంగికి మూకలు నిప్పుపెట్టాయి. మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పయాయు వగోళాలను ప్రయోగించారు. మీటీ తెగ ప్రజల ప్రాబల్యం అధికంగ ఆఉన్న లోయ ప్రాంతాలలో, కుకీలు అధికంగా నివసించే ఉరంగ్‌పట్, గువల్‌తబి వంటి పర్వత ప్రాంతాలలో కాల్పుల సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.