Monday, December 23, 2024

మణిపూర్ సిఎం ఇంటిపై దాడికి యత్నం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ శివారున హెయిన్‌గాంగ్‌లో ఉన్న ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పూర్వీకుల ఇంటిపై అల్లరి మూకలు గురువారం రాత్రి దాడికి ప్రయత్నించారు. భద్రతా దళాల గస్తీ ఉన్నప్పటికీ అల్లరి మూకలు దాడి చేయడానికి దూసుకురాగా భద్రతా దళాలు అప్రమత్తమై వారిని ఆ ఇంటికి 150 మీటర్ల దూరం లోనే అడ్డుకున్నారు. గాలి లోకి కాల్పులు జరిపి అల్లరి మూకలను చెదరగొట్టారు. అయితే ఆ ఇంటిలో సిఎం ప్రస్తుతం ఉండటం లేదు. ఇంఫాల్ నగరం మధ్యలో భద్రతా దళాల రక్షణలో వేరే ఇంటిలో ఇప్పుడు సిఎం ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News