Monday, December 23, 2024

మోబిల్TM కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్‌..

- Advertisement -
- Advertisement -

న్యూ ఢిల్లీ: మోబిల్TM, లూబ్రికేషన్ సాంకేతిక ఆవిష్కరణలో విశ్వగురువు, వీరు నేడు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ను వారి సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టుగా ప్రకటించారు. ఆత్మవిశ్వాసానికి, అసామాన్య శక్తికి ప్రతీక అయిన హృతిక్ మానవ పురోగతికి, విశ్వాస నిర్మాణానికి, కస్టమర్‌లు వారి అసలైన శక్తిని తెలుసుకొనేలా చేయాలనే మోబిల్ బ్రాండ్ విలువలకు సిసలైన ఉదాహరణగా నిలుస్తారు.

భాగస్వామ్యాన్ని ప్రకటిస్తూ, విపిన్ రాణా, సిఈఓ, ExxonMobil Lubricants Pvt Ltd, ఇలా అన్నారు. “భారతదేశంలో మా మోబిల్ లూబ్రికాంట్స్‌కోసం హృతిక్ రోషన్‌తో భాగస్వామ్యం చెందటం మాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. భారతదేశ లూబ్రికాంట్ అవసరాలను పూరిస్తామనే మా మాటకు వ్యాపార భాగస్వాములు, వినియోగదారులలో విశ్వాసం కలిగించేలా ఆయన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని మేము నమ్ముతున్నాము”.

బ్రాండ్ అసోసియేషన్ గురించి వ్యాఖ్య చేస్తూ, నటుడు హృతిక్ రోషన్ ఇలా అన్నారు, “లోకవ్యాప్తంగా నమ్మిక గొన్న మోబిల్ ఇంకా వారి విశ్వసనీయ బ్రాండ్ పేరుతో భాగస్వామ్యం చెందటం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ప్రజల జీవితాలు మరియు సాంఘికపరమైన మార్పుల కోసం విజేతలకు కావలసింది విశ్వాసమని నేను గట్టిగా నమ్ముతాను, మోబిల్ బ్రాండ్ అనేది దానిని చక్కగా ప్రతిబింబిస్తుంది”.

మోబిల్ గతంలో హృతిక్ రోషన్ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేద’ కోసం ఆయనతో భాగస్వామ్యం చెందింది, ఒకరి మంచి కోసం సరైన ఎంపికల ప్రాధాన్యత ఆవశ్యకతను నొక్కి చెప్పిన సందేశాత్మక సినిమా ఇది.”

శతాబ్దానికి పైగా, మోబిల్ ప్రపంచవ్యాప్త లూబ్రికేషన్ అవసరాలను తీరుస్తున్న సాంకేతిక నాయకత్వం, నమ్మకమైన భాగస్వామి. మోబిల్ ఉత్పత్తులు వినియోగదారుల అవసరాలు తీర్చే నిమిత్తం డిజైన్ చేయబడి వారి కార్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్లకు రక్షణ కల్పించటంలో అత్యున్నత ఇంజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వ్యాపారపరంగా, మోబిల్ ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు – ప్రతి పరిశ్రమలోనూ – ఖర్చులు తగ్గించేలా, ఉత్పాదకత పెరిగేలా అలాగే వారి వారి పరికరాల సామర్థ్యం పెంపొందించటంలో సహాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News