Thursday, January 23, 2025

మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఐదు రోజులు ఇంటర్నెట్ బంద్

- Advertisement -
- Advertisement -

Mobile internet services suspended in Manipur

గువాహటి : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఐదు రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శనివారం రాత్రి బిష్ణోపూర్ లోని ఫౌగాక్చావో ఇఖాంగ్ వద్ద దుండగులు ఓ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన అక్కడ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘ వ్యతిరేక శక్తులు సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తుండటంతో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 2021లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ది మణిపూర్ (హిల్ ఏరియాస్ ) అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును ఆమోదించాలని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటిఎస్‌యూ) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు గత కొన్నాళ్లుగా ఈ రాష్ట్రంలో ఎటిఎస్‌యు పిలుపు మేరకు ఆందోళనలు, బంద్‌లు, హైవేపై రాకపోకలను అడ్డుకోవడాలు జరుగుతున్నాయి. ఈ బిల్లు అమలు లోకి వస్తే ఆదివాసీ ప్రాంతాలకు అనేక హక్కులు, అధికారాలు సంక్రమిస్తాయి. గురువారం ప్రభుత్వం ఇటువంటి బిల్లు ఒక దానిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. కానీ ఆ బిల్లు విద్యార్థి సంఘం డిమాండ్లకు అనుకూలంగా లేదు. పైగా అసెంబ్లీ అజెండాలో కూడా లేదు. దీంతో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఐదుగురు ఆదివాసీ విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి జైళ్లకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News