Sunday, December 22, 2024

పూంచ్‌లో మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీసుల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

జమ్మూ: పూంచ్‌లోని ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు లభించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీరులోని పూంచ్, రాజౌరీ జిల్లాలలో శనివారం మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీసులను పాలనా యంత్రాంగం నిలిపివేసింది. పూంచ్ జిల్లాలోని తోపా పీర్ సమీపంలో డిసెంబర్ 21న భద్రతా దళాలకు చెందిన రెండు వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి జరపడంతో ఐదుగురు జవాన్లు మరణించారు. ఇదే ప్రదేశం సమీపంలో శుక్రవారం సాయంత్రం ముగ్గురు స్థానికుల మృతదేహాలు లభించాయి. ఉగ్ర దాడికి సంబంధించి ప్రశ్నించే నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏడుగురు లేదా ఎనిమిది మంది స్థానికులలో ఈ ముగ్గురు ఉన్నట్లు వర్గలు వెల్లడించాయి. పూంచ్ డిసిపి, ఎస్‌పితోసహా సీనియర్ పోలీసు, ఆర్మీ అధికారులు శుక్రవారం రాత్రి వరకు బఫ్లియాజ్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షించినట్లు వర్గాఉలు తెలిపాయి. జమ్మూ దివిజనల్ కమిషనర్ కూడా పూంచ్‌కు బయల్దేరినట్లు వారు చెప్పారు. పూంచ్‌లో స్థానికులు నిరసనలు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి.

సురాన్‌కోట్‌లోని బఫ్లియాజ్ నుంచి రాజౌరిలోని తానామండికి గురువారం మధ్యాహ్నం ఒక జిప్సీ, ఒక మినీ ట్రక్కులో బయల్దేరిన భద్రతా సిబ్బందిపై తోపా పీర్ సమీపంలో కొందపై నక్కి ఉన్న ఉగ్రవాదులు మెరుపుదాడి జరిపారు. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. శుక్రవారం ఉగ్రవాదుల కోసం పూంచ్ అడవుల్లో భారీ ఎత్తున వేట కొనసాగింది. జమ్మూకు చెందిన వైట్ నైట్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్, డిజిపి ఆర్‌ఆర్ స్వెయిన్ శుక్రవారం ఘటనా స్థలాన్ని చేరుకుని భద్రతా పరిస్థితిపై సమీక్ష జరిపారు. డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హోదా అధికారి సారథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) బృందం కూడా మెరుపుదాడి స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించింది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు జరుగుతోందని, పోలీసు జాగిలాలను కూడా రంగంలోకి దింపామని అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News