Friday, November 22, 2024

మొబైల్ ఫోన్లు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయాలి

- Advertisement -
- Advertisement -

Mobile phones should be reported missing

66 సెల్ ఫోన్లు బాధితులకు అందజేత
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపింగ్ మాల్స్, రద్ధీ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న 66మందికి తిరిగి వారి మొబైల్స్ ఇచ్చామని తెలిపారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారు హాక్‌ఐ, మీసేవ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

సౌత్‌జోన్ డిసిపి గజారావు భూపాల్ మాట్లాడుతూ ఫిర్యాదు చేసేవారు ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫిర్యాదు చేస్తే వాటిని వెతకడం సులభంగా ఉంటుందని తెలిపారు. పట్టుకున్న మొబైల్ ఫోన్లలో చాలా ఖరీదైన ఫోన్లు ఉన్నాయని తెలిపారు. మొబైల్స్‌ను ట్రేసవుట్ చేసి పట్టుకున్నామని, ఇందులో కొందరు సెల్ ఫోన్లు మర్చిపోయారని తెలిపారు. కొట్టేసిన మొబైల్ ఫోన్లపై ఫిర్యాదు చేయగా వాటిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. హుస్సేనీ ఆలంలో15, బహదూర్‌పురలో15, మాదన్నపేట పిఎస్ పరిధిలో 09, కామాటిపుర 08, కాలాపత్తర్ 03, చార్మినార్01 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్, కె. శ్రీనివాస్, భరత్ కుమార్, మల్లేష్ దర్యాప్తు చేసి మొబైల్స్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News