Monday, December 23, 2024

ఇంఫాల్‌లో బిజెపి నేతల ఇళ్లకు నిప్పుపెట్టేందుకు యత్నాలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి భద్రతాదళాలకు, మూకలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. బిజెపి నాయకుల ఇళ్లకు నిప్పటింటించడానికి మూకలు ప్రయత్నించినట్లు అధికారులు శనివారం తెలిపారు.

బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా, చురాచంద్‌పూర్ జిల్లాలోని కంగ్వాయ్ గ్రామాలలో రాత్రంతా తుపాకుల హోరు కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. ఇంఫాల్ వెస్ట్‌లోని ఇరింగ్బమ్ పోలీసు స్టేషన్ లూటీకి విఫల యత్నం జరిగింది. ఆందోళనకారులు గుమికూడకుండా నిరోధించడానికి రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో రాత్రంతా ఆర్మీ, అస్సాం రైఫిల్స్, మణిపూర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా కవాతు నిర్వహించాయి.

ఇలా ఉండగా&బిజెపి ఎమ్మెల్యే బిశ్వజీత్ ఇంటిని తగలబెట్టేందుకు మూకలు ప్రయత్నించగా ఆర్‌ఎఎఫ్ దళాలు అడ్డుకుని చెదరగొట్టాయి. సింజెమై వద్ద బిజెపి కార్యాలయాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టగా వారిని సైన్యం చెదరగొట్టింది. బిజెపి మహిళా విభాగం అధ్యక్షురాలు శారదా దేవి ఇంటిని ధ్వంసం చేసేందుకు అర్ధరాత్రి ప్రయత్నించగా సైనిక దళాలు చెదరటొట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News