Friday, April 25, 2025

తిరుమలలో మాక్ డ్రిల్

- Advertisement -
- Advertisement -

తిరుమల: జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న సుద‌ర్శ‌న్‌ స‌త్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.

అద‌న‌పు ఎస్పి రామ‌కృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.

అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్‌, రూమ్ ఇన్ట‌ర్వెన్ష‌న్ కార్య‌క‌లాపాలు చేసి చూపారు. దాదాపు ఒక‌టిన్న‌ర గంట‌పాటు ఈ మాక్ డ్రిల్ కొన‌సాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోప‌స్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో భాగ‌మ‌య్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News