Monday, December 23, 2024

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఈ.వీ.ఎం గోడౌన్‌లో మాక్ పోల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించారు. పలు పార్టీ ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు.

పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని మాక్ పోల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. పోలింగ్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News