Friday, January 24, 2025

మొదటి సినిమాకే భారీ పారితోషికం

- Advertisement -
- Advertisement -

సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టమైన పని అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగా నటీమణులు ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే ఉంటారు. అందంతో డామినేట్ చేస్తూ మిగతా వారికి కూడా చాలా గట్టిగా పోటీని ఇవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అందం విషయంలో అయితే ప్రేక్షకుల అభిరుచి కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అందుకే వారిని ప్రతి సినిమాలో కూడా అకట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని. సినీ రంగంలో కొంత మంది భామలు మొదట్లోనే ఊహించని విధంగా భారీ స్థాయిలో క్రేజ్‌ను అందుకుంటారు. తాజాగా ఓ గ్లామర్ బ్యూటీ మాత్రం మొదటి సినిమాకే ఒక కోటి రూపాయల పారితోషికం అందుకోవడం విశేషం.

ఆ బ్యూటీ మరెవరో కాదు. మోస్ట్ ఫేమస్ మోడల్ మానుషి చిల్లర్. మోడల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ హర్యానా బ్యూటీ 2017 మిస్ ఇండియా పోటీల్లో కూడా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మోడల్‌గా మంచి గుర్తింపును అందుకున్న మానుషికి గత రెండేళ్ల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం కమర్షియల్ సినిమాలు చేయకుండా విభిన్నమైన సినిమాలు చేయాలి అని అడుగులు వేసింది. ఇక మొత్తానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్‌లో అవకాశం దక్కింది.

ఆ సంస్థలో అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైంది. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారత రాజు పృథ్వి రాజ్ చౌహన్ జీవిత ఆధారంగా తెరకెక్కింది. అయితే అతని భార్యగా సన్యోగిత అనే పాత్రలో మానుషి చిల్లర్ నటించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఎంతోమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేసింది. అయితే ఎవరికి కూడా మొదటి సినిమాకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చింది లేదు. కానీ మానుషి చిల్లర్ సినిమాల్లోకి రాకముందే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. కాబట్టి ఆమెకు ఫస్ట్ సినిమాకు ఆ స్థాయిలో పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News