Friday, January 10, 2025

‘మోదానీ మోడల్ ’పై ధ్వజమెత్తిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -
ఇంటర్‌పోల్ జాబితా నుంచి మెహుల్ చోక్సీ పేరు తొలగింపు…
‘మోదానీ మోడల్ ’ అంటే మొదట దోచుకో, తర్వాత శిక్ష నుంచి తప్పించుకో!

న్యూఢిల్లీ: ఆర్థిక మోసానికి పాల్పడి దేశం వదిలి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును ‘ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసెస్’ నుంచి తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై విరుచుకుపడింది. నేర మిత్రులు తప్పించుకుపోయేలా వీలుకల్పిస్తూ, దేశంలో ఉన్న ప్రతిపక్షాలపై మాత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐలతో లక్ష్యం చేసుకుంటుందని ఆరోపించింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘దేశభక్తి గురించి మాట్లాడేవారు నేరస్థులకు రక్షణ కల్పిస్తుండడం పెద్ద జోక్’ అన్నారు. కాగా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ‘విపక్షాలకు ఈడి, సిబిఐ కానీ తన మిత్రులకు విడుదల’అని పేర్కొన్నారు.
‘మోదానీ మోడల్ అంటే మొదట దోచుకో, తర్వాత శిక్షపడకుండా తప్పించుకో’ అని ఆయన వివరించారు. ఖర్గే పార్లమెంటుకు వెళ్ళే ముందు విలేకరులతో మాట్లాడుతూ ‘వారు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేయాల్సిందంతా చేస్తున్నారు. మన ఎంబాసీలపై దాడులు జరుగుతున్నాయి. మన బ్యాంకుల నుంచి డబ్బు కాజేసి పారిపోయిన వ్యక్తులు..మెహుల్ చోక్సీ వంటి వారికి వారు రక్షణ కల్పిస్తున్నారు. మరోవైపు దేశభక్తి గురించి డబ్బాలు కొడుతున్నారు. ఇదో పెద్ద జోక్’ అన్నారు. ‘మేము దీనిపై స్పష్టీకరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తాము’ అన్నారు.

మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 13,000 కోట్లు కాజేసిన కుంభకోణలో కావలసిన వ్యక్తి. ఆయన పేరును ‘ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసెస్’ నుంచి తొలగించారు. ఈ విషయాన్ని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. దీనికి ముందు ఖర్గే తన ట్వీట్‌లో ‘ఈడి, సిబిఐలు కేవలం ప్రతిపక్షాలను లక్షం చేసుకోడానికే ఉన్నాయి. కానీ మోడీజీకి చెందిన ‘మన మెహుల్ భాయ్’ను ఇంటర్‌పోల్ నుంచి విడుదలచేయిస్తారు. తన మిత్రుడిని కాపాడుకోవడం కోసం పార్లమెంటు సమావేశాలను జరుగనివ్వకుండా చేసిన వ్యక్తి తన పాత మిత్రుడికి సాయపడడా? అతడు ఐదేళ్లకు పూర్వం తప్పించుకుపోయాడాయె’ అని పేర్కొన్నారు.

దేశం నుంచి వేలాది కోట్లు పోయాయి. ‘నా ఖానే దూంగా’ అనేది మరో ‘జుమ్లా’(ఉత్తుత్తి మాట) అయి కూర్చుంది’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. రాహుల్ గాంధీ గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ‘క్షమాపణ కోరే ప్రసక్తేలేదు’ అన్నారు. ఇదిలావుండగా బిజెపి నేడు రాహుల్ గాంధీని ‘మీర్ జాఫర్’తో పోల్చి హంగామా చేసింది. బిజెపి ప్రతినిధి సంబిత్ పాత్ర విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీపై మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News