Wednesday, January 22, 2025

ఆదర్శ క్రీడాపాఠశాలకు మొద్దులగూడెం విద్యార్థి ఎంపిక

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామపంచాయితీ పరిధిలోగల ప్రభుత్వ గిరిజన ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థి రాజిని సంతోష్ మార్చి 2023 నెల నందు మోడల్ స్పోర్ట్స్ స్కూలు కిన్నెరసానిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో నిర్వహించిన పలురకాలైన క్రీడా అంశాల పరీక్షలలో అత్యున్నత ప్రతిభ కనబర్చి, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి మోడల్ స్పోర్ట్స్ స్కూలు కిన్నెరసాని నందు సీటు సాధించాడు.

ఈ సందర్భంగా సీటు సాధించిన విద్యార్థి రాజిని సంతోష్‌ను, విద్యార్థి సీటు సాధనలో ప్రత్యేక శ్రద్ధ వహించి, సీటు సాధనలో కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు ఎన్.నాగరాజుని దమ్మపేట మండల విద్యాశాఖ అధికారిణి కె.లక్ష్మీ, పాఠశాల ఎస్‌ఎంసి కమిటీ చైర్మన్ పూచి శ్రీనివాస్, మొద్దులగూడెం గ్రామ సర్పంచ్ సున్నం రాము, మొద్దులగూడెం ఎంపిటిసి దొడ్డా నాగమణి, ఉప సర్పంచ్ దొడ్డా శ్రీరామ్మూర్తి, ఏహెచ్‌ఎస్ చీపురుగూడెం ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్.భద్రమ్మ, ఐటిడిఏ పాఠశాలల పర్యవేక్షణాధికారి కె.లక్ష్మయ్య, గ్రామ పాఠశాల సహ ఉపాధ్యాయులు బి.లక్ పతి, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News