Tuesday, April 1, 2025

“మోడీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ”గా మారిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ : మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

పురూలియా (పశ్చిమబెంగాల్ ): ఎన్నికల ప్రచారంలో విద్వేష ప్రసంగాలు చేస్తున్న బీజేపీ నాయకులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్నికల కమిషన్ గుడ్డిగా వ్యవహరిస్తోందని, మోడల్ ఆఫ్ కాండక్ట్‌ను “మోడీ ఆఫ్ కాండక్ట్ ”గా మార్చి వేసిందని పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ ధ్వజమెత్తారు.

పురూలియాలో ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ, ఇతర బీజేపీ అగ్రనాయకులు తమకు తాము హిందువులుగా పరిగణించుకుంటున్నారని, ఇతర మతాల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. మోడీ, ఇతర బీజేపీ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు హిందువుల్లోని తక్కువ జాతుల వారిని, మైనారిటీలను, ఇతర అణగారిన వర్గాలను భయపెడుతున్నాయని, అయినా ఎన్నికల కమిషన్ ఈ విషయంలో మౌనం వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News