Monday, December 23, 2024

హోటల్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న మోడల్

- Advertisement -
- Advertisement -

 

జోధ్‌పూర్: ఓ మోడల్ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జోధ్‌పూర్‌లో గుంగున్ ఉపాధ్యాయ్ మోడల్‌గా పని చేస్తోంది. శనివారం ఉదయం ఉదయ్‌పూర్ నుంచి జోధ్‌పూర్ వచ్చింది. రతనాడ ప్రాంతంలో హోటల్ లార్డ్ ఇన్‌లో రూమ్ కిరాయికి తీసుకుంది. హోటల్ టెర్రస్ పైనుంచి దూకేముందు తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. వెంటనే తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకునే లోపు ఆమె హోటల్ పైనుంచి దూకేసింది. ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్న విషయాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News