Thursday, January 23, 2025

సంతోషంగా లేనని… హోటల్ రూమ్ లో మోడల్ ఉరేసుకొని

- Advertisement -
- Advertisement -

Young woman body was found in rajendra nagar

 

ముంబయి: మోడల్ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం అంధేరీలో ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హోటల్‌లో ఓ మోడల్ రూమ్ అద్దెకు తీసుకుంది. బుధవారం సాయంత్రం డిన్నర్ కోసం ఆర్డర్ ఇచ్చింది. గురువారం ఉదయం సిబ్బంది వెళ్లి తలుపు తట్టగా ఆమె తీయలేదు. వెంటనే హోటల్ మేనేజర్ పోలీసులు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మాస్టర్ కీతో డోర్ ఓపెన్ చేశారు. మోడల్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో ఐ యామ్ సారీ … తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని, తాను సంతోషంగా లేనని, తనకు శాంతి అవసరమని, అందుకే ఆత్మహత్య చేసుకుంటానని వివరించాడు. వర్సోవా పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News