Wednesday, January 22, 2025

కదులుతున్న కారులో మోడల్‌పై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

 

కేరళ: కేరళలోని కొచ్చిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ టీనేజ్ మోడల్‌తో పరిచయం పెంచుకున్న ఓ మహిళ ఆమెను మోసం చేసింది. కదులుతున్న కారులో 19 ఏళ్ల మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో ఒక మహిళతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి కొడంగల్లూర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ వాహనంలో కాసర్‌గోడ్‌కు చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

నగరంలోని కక్కనాడ్‌లో నివసిస్తున్న బాధితురాలిని ఆమె స్నేహితురాలు, రాజస్థానీ యువకుడు డిజె పార్టీ కోసం ఆహ్వానించారు. అక్కడ ఆమెకు యువకులతో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆ పరిచయంతో ఇంటి దగ్గర దిగబెడుతామని బార్‌లో మద్యం మత్తులో ఉన్న మోడల్‌ను నిందితులు తమ వాహనంలో ఎక్కించుకున్నారు. రాత్రంతా పట్టణం చుట్టూ తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు.

తెల్లవారుజామున ఆమెను రూం దగ్గర వదిలి వెళ్లిపోయారని పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో యవతిపై లైంగిక వేధింపులకు గురైనట్లు తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శుక్రవారం ఉదయం బాధితురాలిని ఆమె రూమ్‌మేట్‌ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది. ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News