Thursday, January 23, 2025

మల్కాజిగిరి నియోకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్ధానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం ఆయన, నేరేడ్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపలి మీనా ఉపేందర్‌రెడ్డి తో కలిసి డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్, ఎస్పీనగర్, సూర్యనగర్‌లలో రూ 51 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కొబ్బరి కాయ కొట్టి శంకుస్ధాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలలో దెబ్బ తిన్న రోడ్లను గుర్తించి, అవసరమైన చోట సీసీ రోడ్డు నిర్మాణం వేయిస్తున్నట్లు చెప్పారు. నేరేడ్‌మెట్ డివిజన్ అభివృద్ధికి ఎల్ల వేళలా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.

ఇంకా కాలనీలు, బస్తీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు వస్తే వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, డీఈ మహేష్, ఏఈ సృజన, నాయులు గోకుల్ చిత్ర, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, జయరాం, చెన్నారెడ్డి, శివ, మహేష్, మధుసూదన్‌రెడ్డి, రాజేష్, శ్రవణ్, మహేష్, రాజు, మోహన్, గోపి, సాయిగౌడ్, నవీన్, అవినాష్, అకిత్, శోభ, ఆర్ధి, దీనదయాళ్, రమాదేవి, విజయలక్ష్మీ, పరిమళ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News