Monday, January 20, 2025

నుమాయిష్ స్టాల్‌లో తెలంగాణ కొత్త సచివాలయం నమూనా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌గా పేరు గాంచిన నుమాయిష్ ప్రారంభమైన నాటి నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. సరికొత్త హంగులతో మరిన్ని కొత్త ప్రదర్శనలతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల వస్తువులు ఈసారి నుమాయిష్‌లో కొలువుదీరాయి. షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నుమాయిష్ నిలిచింది.

కేవలం హైదరాబాద్ వాసులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి సందర్శకులు నుమాయిష్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి నుమాయిష్‌లో తెలంగాణ కొత్త సచివాలయం నమూనాను ఓ స్టాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ స్టాల్లో సచివాలయం డిజైన్‌ను అచ్చు గుద్దినట్లుగా చూపించారు. ఈ స్టాల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. నుమాయిస్ విద్యార్థులు. మహిళలు అధికంగా వస్తుండటంతో సెక్రటేరియట్ ఎలా ఉంటుంది ? దాని నమూనా ఏమిటన్న విషయం అందరికీ తెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News