- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం(ఏప్రిల్ 16) ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతులలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
- Advertisement -