Monday, December 23, 2024

సూరత్‌లో మోడల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సూరత్ : సూరత్‌లో తన ఇంటిలో ఉరి వేసుకుని మరణించిన మోడల్ తనియా సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు క్రికెటర్ అభిషేక్ శర్మకు నోటీస్ పంపగలరని సూరత్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో వారిద్దరు స్నేహితులని, ఆమె వాట్సాప్ చాట్‌లో అతనికి ఒక సందేశం పంపిందని, కాని దానికి స్పందన లేదని ఆయన తెలియజేశారు. తనియా సింగ్ (28) సూరత్ నగరంలోని వెసు ప్రాంతంలో తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ నుంచి వేలాడుతూ కనిపించిందని, ఆత్మహత్య పత్రం ఏదీ దొరకలేదని పోలీసులు చెప్పారు.

‘అభిషేక్ శర్మ దివంగత మోడల్‌కు స్నేహితుడని మాకు తెలిసింది. దర్యాప్తులో మరిన్ని వివరాలు లభించగలవు’ అని అసిస్టెంట్ పోలీస్ కమిసనర్ (ఎసిపి) విఆర్ మల్హోత్రా చెప్పారు. ‘మేము అభిషేక్ శర్మను ఇంకా సంప్రదించలేదు. కాని అతనికి నోటీస్ పంపుతాం’ అని ఎసిపి తెలిపారు. ఆల్ రౌండర్ అయిన అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతుంటాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News