Monday, December 23, 2024

మోడల్ మృతి.. ఫ్యాషన్ షోలో విషాదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నోయిడాలోని ఫిల్మ్‌సిటీలోని స్టూడియోలో ఫ్యాషన్ షోలో ఆదివారం మధ్యాహ్నం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. లైటింగ్ ట్రస్ అనూహ్యంగా కుప్పకూలి మోడల్‌పై పడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో మోడల్‌కు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సెక్టార్ 27లోని కైలాస్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీస్‌లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులుతోపాటు లైటింగ్ ట్రస్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News