Wednesday, January 22, 2025

బీరు ప్రియులకు చల్లటి వార్త

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : బీరు ప్రియులకు చల్లటి వార్త. ప్రతి రోజు బీరు తాగితే మంచిదేనని ఓ సర్వే తెలిపింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ సర్వేనిర్వహించింది. ఏడు వేల మందికి పైగా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలను తెలుసుకున్నారు. సాధారణంగా గుండె సమస్యలు ఉన్న వారు బీరును రోజుకు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సర్వే రిపోర్ట్ లో పేర్కొన్నారు.

గుండెపోటు వచ్చే అవకాశాన్ని కూడా బీర్లు తగ్గిస్తాయని సర్వేలో పేర్కొన్నారు. ఇక బీర్లలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని పేర్కొన్న సర్వే దీనిని తాగడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని పేర్కొంది. ఇందులో విటమిన్ బీ, ప్రోటీనులు కూడా ఉంటాయని తెలుస్తుంది. వైన్‌తో పోలీస్తే బీర్ లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని సర్వేలో తేలింది. అంతేకాకుండా పాలలో ఏవిధంగా ఎముకల బలంగా మారడానికి కావాల్సిన పదార్ధాలు ఉంటాయో అలాగే బీరులో కూడా ఉంటాయని తెలిపింది సర్వే.

ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే దంతాల ఆరోగ్యానికి కూడా ఈ బీర్ ఎంతో ఉపయోగపడుతుందట. నోటిలో క్యావిటీస్ రాకుండా చేసే ఔషధాలు బీర్ లో ఉంటాయట. అంతేకాకండా నోటిలో ఏవైనా ఇన్ఫెక్షన్ కలిగే బ్యాక్టీరియాలు లాంటవి ఉంటే అవి కూడా బీర్ దెబ్బకు పరార్ అవుతాయంట. ఇక వారానికి దాదాపు 14 గ్లాసుల బీర్ తాగితే టైప్ 2 డయాబెటిస్ కు గురయ్యే ప్రమాదం తగ్గుతుందంట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News