Wednesday, January 22, 2025

రాష్ట్రానికి తప్పిన వాయుగుండం ముప్పు

- Advertisement -
- Advertisement -

Moderate rains in telangana till 13th

తగ్గనున్న వర్షాల తీవ్రత
13వ తేదీ వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాల తీవ్రత కూడా తగ్గినట్లేనని పేర్కొంది. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినా మనరాష్ట్రంలోకి ప్రవేశించకపోవడంతో రాష్ట్రానికి వాయుగుండం ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 13 వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News