Monday, December 23, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Moderate to heavy rains across Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిధిలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, నారాయణగూడ, అఫ్జల్‌గంజ్, గోషామహల్, మంగల్‌హాట్, సికింద్రాబాద్, పద్మారావ్‌నగర్, చిలుకలగూడ, సీతాఫల్‌మండి, వారాసిగూడ, బౌద్ధనగర్, మెహదీపట్నం, బంజారాహిల్స్, గుడిమల్కాపూర్, లంగర్ హౌస్, గోల్కొండ, ఖైరతాబాద్, అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, కూచిగూడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురవ్వగా, రోడ్లపై వర్షం నీరు నిల్వకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

నేడు పలు జిల్లాలో….

రాష్ట్రవ్యాప్తంగా నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News