Saturday, November 23, 2024

సర్కార్ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షలకు సంబంధించిన ఫాకో మిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటి కాటరాక్ట్ ఆపరేషన్లు అధునాతన పద్దతిలో నిర్వహించేందుకు రూ.28 లక్షలతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఫాకో మిషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో శుక్లాల ఆపరేషన్ సౌకర్యం పేద ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆధునిక యంత్రాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని ఆయన అన్నారు. ఈ యంత్రం ద్వారా ఆపరేషన్లు చేయించుకున్నవారు త్వరగా కోలుకుంటారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు పనులు పూర్తయినట్లు, ఫర్నీచర్, కావాల్సిన యంత్రాల కొరకు వేచియున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News