Tuesday, December 24, 2024

ఇక్కడ కొత్త విషయం నేర్చుకుంటున్నాను: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: దేశంలో జనాభా అవసరాలకు సరిపోవు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో రసాయనిక ఎరువులు ఆధునిక వంగడాలను ప్రవేశ పెట్టారని, కానీ వాటిని వాడే విధానంపై రైతులకు అవగాహన కల్పించడంలో దేశాన్ని పాలిస్తున్న బిజెపి పాలకులు విఫలమయ్యారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మల్టీ పర్పస్ హైస్కూలులో బాల వికాస ఆధ్వర్యంలో మూడు రోజుల జరిగే సేంద్రీయ రైతుల మెగా మార్కెట్ ఆర్గానిక్ మేళాను రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

ప్రపంచమంతా భూసారం సంరక్షణ, టెర్రరిజం నిర్మూలన, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని, దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య మతం, కులం చిచ్చు పెట్టి కొట్టుకునే విధంగా చూస్తున్నదని మంత్రి విమర్శించారు. జనాభా పెరగడం మూలంగా వారి ఆహారం కోసం గతంలో వాడిన సేంద్రియ పద్ధతులను పక్కన పెట్టి వ్యవసాయ విప్లవం పేరుతో క్రిమి సంహారక మందులు మొదలు పెట్టారని మండిపడ్డారు. మందుల వాడకం మోతాదు మించడంతో ప్రపంచ వ్యాప్తంగా మరో 50, 60 రకాల పంటలు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు.

భూసార పరీక్షలు జరిపి అవసరమైన మందులను వాడుతూ, సేంద్రియ పంటల సాగుకు రైతులు రావాల్సిన అవసరం ఉందని, మోతాదు మించి ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమై భూమిలో కార్బన్ శాతం తగ్గిపోయిందని, సార వంతమైన భూమిలో 7 శాతం కార్బన్ ఉండాల్సి ఉండగా ఇవాళ దేశంలో సగటున ఒక శాతం మాత్రమే ఉన్నదని ఇవాళ ఎక్కువ ఎరువులు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుందని ఆలోచనలో రైతులు ఉన్నారన్నారని వ్యవసాయ మంత్రి చెప్పుకొచ్చారు. ప్రపంచానికి ఆహార పదార్థాలను ఒక్క భారతదేశం మాత్రమే ఎగుమతి చేయగలదని కానీ దాన్ని సరైన విధానంలో సద్వినియోగం చేసుకోలేక దేశంలోని పాలకులు ఉపయోగించు కోలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏ ప్రయత్నం అయినా మొదటి చిన్నగానే ప్రారంభం అవుతుందని ప్రజలు దాన్ని ఆచరించినప్పుడు అది ఒక చరిత్రగా నిలుస్తుందని, దాన్ని ప్రారంభించిన వారే చరిత్రలో మిగులుతారని అలాంటి నాయకుడే మంత్రి హరీష్ రావు అని వ్యవసాయ మంత్రి కొనియాడారు. సిద్దిపేటకు వచ్చిన ప్రతిసారి ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకునేందుకు తాను వస్తున్నానని, మంత్రి హరీష్ రావును అనుసరిస్తే చాలు ఇక్కడ అభివృద్ధిని కాపీ కొట్టి మా నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి వెళ్లేలా చేయవచ్చునని మంత్రి వెల్లడించారు.

మన తెలంగాణలో 50 ఏళ్ల క్రితం వరకు తొలకరి వచ్చే వరకు పశువుల ఎరువులు ఇతర మెళుకువలతో పొలాల్లో పోసి చేలకు తెచ్చే విధంగా ఎరువులుగా వాడేవారని కానీ, ఇవాళ సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల భూమి సార వంతాన్ని కోల్పోతుందని, భూమిని సారవంతం చేయడంలో సేంద్రియ ఎరువులు ప్రధాన భూమిక పోషిస్తాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News