పిల్లలను కోరుకోవడం లేదు
ఒకవేళ కావాలనుకున్నా అద్దె గర్భం ద్వారా
కనాలనుకుంటున్నారు,తల్లిదండ్రులను
తమతో ఉంచుకోవాలనుకోవడం లేదు, ఇది
మంచి ధోరణి కాదు
కర్నాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆధునిక మహిళల్లో చాలావరకు ఒంట రి జీవితాన్ని ఆశిస్తున్నారని, పెళ్లి తర్వాత కూడా పిల్లలు కావాలని కోరుకోవడం లేదని కర్నాటక ఆరోగ్యశాఖమంత్రి కె.సుధాకర్ సంచలన వ్యాఖ్య లు చేశారు. ఓవేళ పిల్లలు కావాలనుకున్నా సరోగ సీ (ఇతరుల గర్భం)ద్వారా కనాలనుకుంటున్నా రని ఆయన అన్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణి సరైంది కాదని కూడా ఆయన అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆది వారం ఓ కార్యక్రమంలో సుధాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన సమాజంపై పాశ్చాత్య ప్రభావం వ ల్ల తల్లిదండ్రులను మనతోపాటు ఉండటానికి కూడా ఇష్టపడటంలేదని, ఒంటరిగా వదిలేస్తున్నా మని ఆయన అన్నారు. భారతీయుల్లోని ప్రతి ఏ డుగురిలో ఒకరికి ఏదో ఒక మానసిక సమస్య ఉ న్నదని, అది స్వల్పమైందైనా కావొచ్చు, మధ్యస్తం, తీవ్రమైందైనా కావొచ్చునన్నారు. ఒత్తిడిని తగ్గించు కునే విధానం ఓ కళ. అది భారతీయులు మరొకరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచా నికే మనం నేర్పగలమని ఆయన అన్నారు. యోగా, ప్రాణాయామంలాంటి ప్రక్రియల్ని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు.