హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు పరిచయం చేసింది అంటే డైరెక్టర్ రాజమౌళి. మగధీర, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ను షేక్ చేశారు. వరల్డ్ వైడ్‌గా ప్రముఖ డైరెక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. సినిమా పోస్టర్ పై రాజమౌళి ముద్ర పడిందంటే చాలు బ్లాక్‌బస్టర్ కావాల్సిందే. ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన రారాజు రాజమౌళి. నెట్‌ఫ్లిక్స్ అనే ఓటిటి సంస్థ రాజమౌళిపై ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్‌ను తాజాగా నెట్‌ప్లిక్స్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయి. రాజమౌళిపై ఉన్న అభిప్రాయాలను నటులు ఎన్‌టిఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, సంగీత దర్శకుడు కీరవాణిలు వెల్లడించారు. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు. ట్రైలర్ విడదుల చేసిన ఒక గంటలోనే 40 వేల మంది వీక్షించగా 200 మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇండియా ఫిల్మ్ కు లెజెండ్ అనే కామెంట్లు పెట్టారు.
రాజమౌళిపై డాక్యుమెంటరీ… ట్రైలర్ అద్భుతంగా ఉంది
- Advertisement -
- Advertisement -
- Advertisement -