Monday, January 20, 2025

పటాన్‌చెరులో ఆధునిక వైద్య సేవలు

- Advertisement -
- Advertisement -
  • రూ.184.87కోట్లతో ఆసుపత్రి నిర్మాణం
  • 200ల పడకలతో అభివృద్ధి
  • దశాబ్ది ఉత్సవాల్లో 22న సిఎం భూమి పూజ

సంగారెడ్డి: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు ప్రాంతం తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది. స్వరాష్ట్రంలో అన్ని వసతులను సమకూర్చుకోవడం ద్వారా ప్రజా సంక్షేమంలో ఈ ప్రాంతం పరుగులు తీస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పటాన్‌చెరు ప్రాంతంలో నివసిస్తుంటారు. అందుకని ఈ ప్రాంతాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. అలాంటి పటాన్‌చెరులో ప్రభుత్వాసుపత్రిలో 200ల పడకలతో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేక కృషితో ఈ ఆసుపత్రి మంజూరయ్యింది. 184.87 కోట్లతో నిర్మించనున్న ఈ ఆసుపత్రి పనులకు గురువారం సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి తగిన విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

పటాన్‌చెరు ఏరియాలో చిన్న పెద్ద పరిశ్రమలు 4వేల వరకు ఉంటాయి. వీటిలో పనిచేస్తున్న వారంతా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వైద్య సేవలు అవసరం అయినప్పుడు మాత్రం పటాన్‌చెరులో ఉన్న ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతుంది. దీంతో బాధితులు రాజధానికి పరుగులు తీయాల్సి వస్తున్నది. తద్వారా వ్యయ ప్రయాసల కోర్చుతున్నారు. సకాలంలో వైద్యం అందక అనేక కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణంతో కార్మికులకు పెద్ద వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ఆస్పత్రి నిర్మాణానికి ఖర్చయ్యే నిధుల్లో 25శాతం అంటే 46.21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుండగా, మిగిలిన 138.65 కోట్ల రూపాయలను కాలుష్య నియంత్రణ మండలి సమకూర్చుతోంది.

పటాన్‌చెరులో నిర్మించే ఈ 200ల పడకల ఆసుపత్రి ఆధునిక హంగులను సంతరించుకోనుంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మూడు అంతస్తుల్లో 93వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నారు. జనరల్‌సర్జరీ, సిటీ సర్జరీ, డెర్మాటాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్ వంటి వైద్య సేవలు పేదలకు అన్ని వర్గాలకు అందుబాటులోకి వస్తాయి. సివిల్ వర్క్ నిర్మాణం, పరికరాలు, ఫర్నిచర్, ల్యాబల్ సేకరణ, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆధ్వర్యంలో 200ల పడకలతో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది.

పారిశ్రామిక వాడలో కార్మికులకు పెద్ద దిక్కుగా ఆసుపత్రిలో సేవలందనున్నాయి. ఈ దవాఖానలో అత్యాధునిక వైద్య సేవలు అందనున్నాయి. శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఏర్పాటు కానుంది. ఎన్‌ఐసియు, డయాలసిస్, కార్టియాక్, ఎంఐసియు, న్యూరో కార్టియాక్,ఐసియూ ఎన్‌ఎస్‌ఐసియు వార్డులు అందుబాటులో ఉంటాయి. గైనకాలజీ, సర్జరీ, జనరల్ మెడిసిన్ సేవలు కూడ ఉంటాయి. ఇక ల్యాబ్ సేవల విషయానికి వస్తే మైక్రో బయాలజీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్ పథాలజీ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్ క్యాత్ ల్యాబ్‌లుంటాయి. సిఎం శంకుస్థాపన చేయనున్న తరుణంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా కలెక్టర్ శరత్ ,ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎస్‌పి రమణకుమార్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జరిగే సభ ఏర్పాట్లపై మంగళవారం సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News