నిజామాబాద్: నూతర ఒరవడితో మెట్రోనగరాలకు దీటుగా నిజామాబాద్ నగరంలో ఆధునిక వైద్యం (కార్పొరేట్ స్థాయి) అందిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం ఖలీల్‌వాడిలో శ్రీచక్ర ఆసుపత్రిని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో జిల్లా ప్రజలకు వైద్యం మరింత దగ్గర చేయాలనే ఆలోచనతో పాటుపేద ప్రజలకు కూడా నగరంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండునీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు నీలి రాంచందర్, జలగం తిరుపతిరావు, ఆసుపత్రి యాజమాన్యం, జనరల్ పీజిషియన్ డాక్టర్ విశ్వతేజ రెడ్డి, న్యూరో సర్జర్ డాక్టర్ మేఘరాజ్, ఆర్తోపెడిక్ డాక్టర్ హర్షవర్ధన్ గౌడ్, ఇఎన్‌టి డాక్టర్ అన్వేష్ కృష్ణ, ఫిజియోథెరపి డాక్టర్ శివకుమార్, మేనేజ్మెంట్ పవన్ గౌడ్, రాజేష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.