Wednesday, December 25, 2024

దాంపత్య జీవితం కోసం నేడు వైద్య రంగంలో ఆధునిక చికిత్సలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నేటి సమాజంలో యుక్త వయస్సులోనే ఫెర్టిలిటీ అనే అంశంపై అవగాహన కలిగి ఉండడం ఎంత ఆవశ్యకతతో కూడిన అంశమని ఫెర్టిలిటీ స్పెషలిస్టు డా.దుర్గ పేర్కొన్నారు. ఫెర్టిలిటీ సంబంధించిన పరీక్షలను యుక్తవయస్సులోనే నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.  విరించి ఫెర్టిలిటీ సెంటర్ రెండవ వార్షికోత్సవ వేడుకలను నేడు(శనివారం) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ పరిస్థితులలో పిల్లలను కనలేక ఇబ్బంది పడుతున్న దంపతులకు ఇపుడు ఆధునిక వైద్య శాస్త్రంలో ఎన్నో రకాలైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దాంపత్య సంబంధిత ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు నాటు వైద్యులు కానీ ఇతరత్రా మార్గాలను అన్వేషించడం మానేసి నిపుణులైన వైద్యులను సంప్రదించి సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని కనుగొనాలని సూచించారు.

అనంతరం ఆసుపత్రి చైర్మన్, లతా ఫౌండేషన్ ట్రస్టీ మాధవీ లత ప్రసంగిస్తూ దంపతులు తమ పిల్లలలో ఆడ, మగ అనే తేడాలు చూపించకుండా అందరికీ సరిసమానమైన అవకాశాలు అందించాలని సూచించారు. ముఖ్యంగా దంపతులు మగ పిల్లలను మాత్రమే కనాలనే కోరిక నేడు దేశంలో జరుగుతున్న ఎన్నో బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని ఈ ఆలోచనా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఆడ పిల్లలు, మగ పిల్లలతో సమానంగా అన్ని రకములైన కుటుంభ బాధ్యతలను పోషించడంలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. అంతే గాకుండా నేటి సమాజంలో తల్లితండ్రులు తమ పిల్లలకు మంచి ఆదర్శాలను అందజేసి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో డా. సాయి రవి కిరణ్‌తో పాటు పలువురు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, రోగులు వారి కుటుంభ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News