Monday, January 20, 2025

ఉక్రెయిన్‌కు 50 దేశాల నుంచి ఆధునిక ఆయుధాలు

- Advertisement -
- Advertisement -

Modern weapons from 50 countries to Ukraine

అమెరికా రక్షణ కార్యదర్శి ఆస్టిన్ వెల్లడి

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు హార్పూన్ లాంచర్లు, క్షిపణులు వంటి అత్యంత ఆధునిక సాంకేతిక ఆయుధాలను ఎక్కువ సంఖ్యలో పంపడానికి దాదాపు 50 దేశాల రక్షణ మంత్రులు అంగీకరించారని అమెరికా రక్షణ కార్యదర్శి లియోడ్ ఆస్టిన్ పాత్రికేయులకు వెల్లడించారు. అమెరికా అత్యంత సాంకేతిక మొబైల్ రాకెట్ లాంచర్లను ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు పంపుతుందా ? అన్న ప్రశ్నకు కొన్ని 20 దేశాలు భద్రతా సహాయంగా ఉక్రెయిన్‌కు కొత్త ప్యాకేజీలు పంపుతామని సోమవారం ప్రకటించాయని చెప్పారు. ముఖ్యంగా ఉక్రెయిన్ తన తీర ప్రాంతాన్ని రక్షించుకోడానికి సహాయంగా హార్పూన్ లాంచర్లను డెన్మార్క్ పంపడానికి అంగీకరించిందని తెలిపారు. నల్లసముద్రంలో రష్యా యుద్దనౌకలు తిష్ట వేసి ఉన్నాయి. క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించడానికి రష్యా ఆ నౌకలను ఉపయోగించుకుంటోంది. ఉక్రెయిన్ రేవు పట్ణణాల్లో ఇతర దేశాల వాణిజ్య నౌకలు ప్రవేశించకుండా రష్యా అడ్డుకుంటోంది. ఉక్రెయిన్‌కు కావలసిన యుద్ద సామగ్రి తాము సహాయం చేస్తున్నామని, చాలా దేశాలు కీలకమైన మందుగుండు సామగ్రి, కోస్తా రక్షణ వ్యవస్థలను, యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయని చెప్పారు. పోరాడే హెలికాప్టర్లు, ట్యాంకులు, రాకెట్లు జెక్ రిపబ్లిక్ ఇటీవల ఉక్రెయిన్‌కు పంపిందని, ఇటలీ, గ్రీస్, నార్వే, పోలండ్ కొత్తగా ఆర్ధిక సహాయాలను సోమవారం ప్రకటించాయని తెలిపారు. గత కొన్ని వారాలుగా ఫిరంగులతో అక్కడ యుద్దం జరుగుతోందని ఆమేరకు ఫిరంగులు, మందుగుండు సామగ్రి పంపడమౌతోందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News